: శ్రీలంక టీం బాగుంది: రాహుల్ ద్రవిడ్
ఐసీసీ ప్రపంచకప్ దగ్గరపడుతుండడంతో ఏ జట్టు టైటిల్ ను ఎగరేసుకుపోతుందా? అంటూ ఊహాగానాలు ఉపందుకున్నాయి. జట్ల కూర్పును పరిశీలించిన టీమిండియా క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ శ్రీలంక జట్టుకు ఓటేశారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, శ్రీలంక జట్టు పటిష్టంగా ఉందని అన్నారు. శ్రీలంక జట్టు కూర్పు బాగుందని ఆయన పేర్కొన్నారు. శ్రీలంక జట్టులో అనుభవజ్ఞులైన కుమార సంగక్కర, మహేళ జయవర్థనే, దిల్షాన్ తో పాటు బౌలర్లు కూడా సమర్థులని ఆయన అభిప్రాయపడ్డారు. దీంతో టైటిల్ పోరులో శ్రీలంక ఉండే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.