: ఫాం కోసం మైకేల్ క్లార్క్ ఆరాటం!


వరల్డ్ కప్ సమీపిస్తోంది. బిజీ షెడ్యూల్ తో అలసిపోయిన టీమిండియా ఆటగాళ్లు సెలవుల్లో ఉండగా, ఇతర జట్ల ఆటగాళ్లు సన్నాహాల్లో మునిగిపోయారు. ఆస్ట్రేలియా కెప్టెన్ మైకేల్ క్లార్క్ కోల్పోయిన ఫాంను తిరిగి దొరకబుచ్చుకునేందుకు బేస్ బాల్ బ్యాట్ తో ప్రాక్టీస్ చేస్తున్నాడు. చీలమండ గాయంతో ఫిట్ నెస్ కోల్పోయి క్రికెట్ మ్యాచ్ లకు దూరంగా ఉన్న మైకేల్ క్లార్క్ తాజాగా బేస్ బాల్ బ్యాట్ తో నెట్స్ లో చెమటోడ్చాడు. వరల్డ్ కప్ ప్రారంభమయ్యేనాటికి క్లార్క్ పూర్తి ఫిట్ నెస్ నిరూపించుకుంటాడని ఆసీస్ కోచ్ డారెన్ లీమన్ ఆశాభావం వ్యక్తం చేశాడు. వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా జట్టును క్లార్క్ నడిపిస్తాడని లీమన్ పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News