: మానవులు పర్యావరణానికి పరిరక్షకులు మాత్రమే, యజమానులు కాదు: అమెరికన్ స్వామి
భారత్ లో 12 లక్షల మంది స్కూలు పిల్లల ఆకలి బాధ తీరుస్తున్న 'ఇస్కాన్' ఉచిత మధ్యాహ్న భోజన పథకానికి ప్రేరణశక్తిగా నిలుస్తున్న అమెరికా జాతీయుడు స్వామి రాధానాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మానవులు పర్యావరణానికి పరిరక్షకులు మాత్రమేనని, యజమానులు కారని స్పష్టం చేశారు. ఈ సిద్ధాంతం ఆధారంగా తాము అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్టు చెప్పారు. తమ సంస్థ ద్వారా చేపట్టే ప్రజోపయోగ కార్యక్రమాల్లో ప్రధానంగా పర్యావరణ హిత పథకాలకు పెద్దపీట వేస్తామని తెలిపారు. జంతువులు కూడా మనలాగా భూమిపై హక్కులు కలిగి ఉన్నాయన్న విషయాన్ని గుర్తించినప్పుడే మానవాళి వికాసం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. వ్యర్థాలను కూడా సద్వినియోగం చేసుకోవడంపై తాము ప్రజలకు బోధిస్తున్నామని వివరించారు.