: అత్యంత ఆరాధ్య ప్రముఖుల జాబితాలో సల్మాన్, కత్రినా, కరీనా... మోదీయే టాప్
భారత్ లో 'అత్యంత ఆరాధ్య ప్రముఖులు'గా బాలీవుట్ నటుడు సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్, కరీనా కపూర్ ఖాన్ నిలిచారు. లండన్ కు చెందిన ఆన్ లైన్ మార్కెట్ రీసెర్చ్ పోర్టల్ yougov.com తాజాగా ఓ సర్వే చేసింది. దాని ఆధారంగా అత్యంత ప్రముఖులతో ఓ జాబితా విడుదల చేసింది. హిందీ చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ గా వెలుగొందుతున్న సల్మాన్ అన్ని తరాల ప్రేక్షకులను తన నటనతో అలరిస్తున్నాడు. మరోవైపు, సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. ఈ జాబితాలో సల్లూ నాలుగవ స్థానంలో ఉన్నాడు. ఈ నటుడి మాజీ ప్రేయసి కత్రినా తన అందం, నటన, ప్రేమ వ్యవహారాలతో పాప్యులర్ అయింది. జాబితాలో కేట్ ఐదవ స్థానంలో నిలిచింది. ఇక, పలు విజయవంతమైన చిత్రాల్లో తన నటనతో ప్రశంసలందుకున్న కరీనా ఈ జాబితాలో తొమ్మిదవ స్థానంలో ఉంది. ఇదే జాబితాలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ తొలి స్థానాన్ని ఆక్రమించారు. మాజీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ రెండవ స్థానంలో నిలిచారు.