: మేకిన్ ఇండియా అంటున్న మోదీ... తన సూటును మాత్రం బ్రిటన్ లో తయారు చేయించారట


అమెరికా అధ్యక్షుడు ఒబామా భారత పర్యటన సందర్భంలో ప్రధాని మోదీ ధరించిన సూట్ తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా విమర్శనాస్త్రాలు సంధించారు. మేకిన్ ఇండియా అంటూ ఊదరగొడుతున్న మోదీ... తన సూటును మాత్రం బ్రిటన్ లో తయారు చేయించుకున్నారని ఆరోపించారు. దీని కోసం రూ. 10 లక్షలు ఖర్చు చేశారని మండిపడ్డారు. ప్రజలకు ఉపాధి కల్పించడంలో విఫలమైన మోదీ... ప్రజల చేతికి చీపురు మాత్రం ఇచ్చారని అన్నారు.

  • Loading...

More Telugu News