: బెజవాడ వాసుల్లో ఆనందం లేదు... సీమలో రెండో రాజధాని ఏర్పాటు చేయండి: టీజీ


టీడీపీ నేత, రాయలసీమ హక్కుల ఐక్య వేదిక వ్యవస్థాపకుడు టీజీ వెంకటేశ్ మళ్లీ మీడియా ముందుకు వచ్చారు. కొద్దిసేపటి క్రితం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నవ్యాంధ్ర రాజధాని ఏర్పాటుతో విజయవాడవాసుల్లో ఏమాత్రం ఆనందం కనిపించడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. విలువైన భూములను కోల్పోతున్నామన్న బాధ, ధరల పెరుగుదల తదితరాలపై బెజవాడ వాసులు అసంతృప్తిగా ఉన్నారని ఆయన చెప్పారు. ఇదిలా ఉంటే, రాయలసీమలో ఏపీ రెండో రాజధానిని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాయలసీమలో ఏర్పాటు చేసే రాజధానిని సమ్మర్ లేదా వింటర్ రాజధానిగా ప్రకటించాలని ఆయన కోరారు. రాజధాని కోసం కర్నూలు పక్కన 30 వేల ఎకరాల భూమి సిద్ధంగా ఉందన్నారు. ఏపీకి కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీపై కూడా టీజీ అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం విడుదల చేసిన నిధులు గుడ్డిలో మెల్ల మాదిరిగా ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News