: అండమాన్, నికోబార్ లోనూ టార్గెట్ పెట్టుకున్న టీడీపీ
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో సభ్యత్వ నమోదును పూర్తి చేసిన తెలుగుదేశం పార్టీ త్వరలో అండమాన్, నికోబార్ దీవుల్లోను ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఈ మేరకు టీడీపీ యువనేత నారా లోకేశ్ ను అండమాన్, నికోబార్ టీడీపీ అధ్యక్షుడు మాణిక్యరావు కలిశారు. మార్చి మొదటివారం నుంచి అక్కడ సభ్యత్వ నమోదును మొదలుపెట్టాలని నిర్ణయించారు. లక్ష సభ్యత్వాల నమోదును లక్ష్యంగా పెట్టుకున్నారు.