: జాతీయ క్రీడల్లో తెలంగాణకు రెండు... ఏపీకి ఒకటి
కేరళలో జరుగుతున్న 35వ జాతీయ క్రీడల్లో రెండు తెలుగు రాష్ట్రాలు నిరాశాజనక ప్రదర్శనను కొనసాగిస్తున్నాయి. ఇప్పటి వరకు 2 బంగారు పతకాలతో తెలంగాణ 13వ స్థానంలో నిలవగా, ఒక్క బంగారు పతకం సాధించి ఏపీ 16వ స్థానంలో నిలిచింది. మొత్తం మీద తెలంగాణకు 2 బంగారు, 7 రజత, ఒక కాంస్య పతకం లభించాయి. ఇక ఏపీ విషయానికి వస్తే, ఒక గోల్డ్, ఒక సిల్వర్, 4 బ్రాంజ్ మెడల్స్ సాధించింది.