: తెలంగాణ సచివాలయం తరలింపుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇ-పిటిషన్
తెలంగాణ రాష్ట్ర సచివాలయాన్ని ఎర్రగడ్డలోని ఛాతీ ఆసుపత్రి ప్రాంగణానికి తరలించాలన్న సర్కారు నిర్ణయంపై పలువురి నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తాజాగా ఆన్ లైన్ లో తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇ-పిటిషన్ పెట్టినట్టు తెలంగాణ కాంగ్రెస్ పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డి తెలిపారు. www.change.org వెబ్ సైట్ లో ఆ పిటిషన్ ఉంచినట్టు చెప్పారు. ఈ వెబ్ సైట్ ద్వారా గవర్నర్ నరసింహన్ కు పిటిషన్ ను పంపారు. సచివాలయం తరలింపును వ్యతిరేకిస్తూ పిటిషన్ పై సంతకం చేయాలని ఎమ్మెల్యే అందరినీ కోరారు. రంగారెడ్డి జిల్లాలోని వికారాబాద్ కు ఛాతీ ఆసుపత్రిని తరలించి, సచివాలయాన్ని ఎర్రగడ్డకు తరలిస్తున్నారని, కేసీఆర్ ఓ మోనార్క్ లా నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఈ తరలింపును అడ్డుకునేందుకు అందరూ మద్దతుగా నిలబడాలని ఆయన కోరారు.