: ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీకి డేరా బాబా మద్దతు
డేరా సచ్చా సౌదా అధినేత గుర్మీత్ రాం రహీమ్ సింగ్ అలియాస్ డేరా బాబా ఢిల్లీ ఎన్నికల ప్రచారం చివరిరోజున బీజేపీకి మద్దతు తెలిపారు. ఢిల్లీలో తమకు 20 లక్షల మంది అనుచరులున్నారని డేరా రాజకీయ విభాగ కార్యదర్శి అమన్ ఇన్సాన్ తెలిపారు. బీజేపీకి మద్దతు తెలుపుతున్నామని, వారి అభ్యర్థులను గెలిపించాలన్న సందేశాన్ని వ్యాప్తి చేస్తామన్నారు. నేటితో ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది కాబట్టి, ఈ ఒక్కరోజు డేరా బాబా అనుచరులు బీజేపీకి మద్దతుగా ఢిల్లీ నగరంలో ప్రచారం చేసే అవకాశమున్నట్టు తెలుస్తోంది.