: జాతికి సేవ చేసేందుకు మాకు అవకాశం రాబోతోంది: కేజ్రీవాల్
ఢిల్లీలో పార్టీ విజయంపై ఆమ్ ఆద్మీ పార్టీ నేత, సీఎం అభ్యర్థి అరవింద్ కేజ్రీవాల్ చాలా ధీమాగా ఉన్నారు. జాతికి సేవ చేసేందుకు మళ్లీ అవకాశం రాబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నిస్వార్థంగా ప్రచారం చేస్తున్న ఆప్ కార్యకర్తలకు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. పోలింగ్ కు మిగిలున్న 48 గంటల సమయంలో కష్టపడి పనిచేయాలని వారికి సూచించారు. "ఇప్పుడు మేము దేశం కోసం పని చేయాల్సి ఉంది. దేవుడు మాతో ఉన్నాడు. ఈ క్రమంలో ఢిల్లీ పౌరులు తప్పకుండా గెలుస్తారు" అని కేజ్రీ పేర్కొన్నారు. మరోవైపు ఆప్, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. డబ్బులిచ్చి ఓటర్లను బీజేపీ ప్రభావితం చేస్తోందని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అశుతోష్ వ్యాఖ్యానించారు.