: అవిశ్వాస తీర్మానం గట్టెక్కిన నాగాలాండ్ ముఖ్యమంత్రి


నాగాలాండ్ ముఖ్యమంత్రి టీఆర్ జెలియాంగ్ శాసనసభలో తమ బలం నిరూపించుకున్నారు. జెలియాంగ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ రాష్ట్ర ప్రతిపక్షం శాసనసభలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. అయితే, ఈ తీర్మానం అత్యంత దారుణంగా వీగిపోయింది. నాగాలాండ్ శాసనసభలో మొత్తం సభ్యుల సంఖ్య 60 కాగా... 59 మంది సభ్యులు సీఎం జెలియాంగ్ కు మద్దతు పలికారు. కేవలం ఒక్క సభ్యుడు మాత్రమే ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం గమనార్హం. దీంతో, ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయిందని స్పీకర్ ప్రకటన జారీ చేశారు.

  • Loading...

More Telugu News