: ఉపఎన్నికపై దృష్టిపెట్టిన లోకేశ్... రేపు తిరుపతిలో ప్రచారం


తిరుపతి ఉపఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కుమారుడు, పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి కన్వీనర్ నారా లోకేశ్ పాల్గొననున్నారు. రేపు ఉదయం ఆయన తిరుపతి చేరుకుంటారు. తొలుత పార్టీ ముఖ్యులతో సమావేశయ్యే ఆయన ఎన్నికల వ్యూహంపై సమీక్షిస్తారు. అనంతరం మధ్యాహ్నం నగరంలో జరిగే ఎన్నికల ప్రచారంలో పాలుపంచుకుంటారు. టీడీపీ ఎమ్మెల్యే వెంకటరమణ అకాల మరణం నేపథ్యంలో తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నిక జరుగుతోంది. పదవిలో ఉండగానే వెంకటరమణ మరణించడంతో ఆయన కుటుంబ సభ్యుల్లో ఒకరిని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలన్న టీడీపీ వినతిని తోసిపుచ్చిన కాంగ్రెస్ తన అభ్యర్థిని బరిలోకి దింపింది. దీంతో, తిరుపతి ఉపఎన్నికలో పోలింగ్ తప్పనిసరిగా మారింది. ఇప్పటికే టీడీపీతో పాటు కాంగ్రెస్ కూడా భారీ ఎత్తున ప్రచారం నిర్వహిస్తోంది. అంతేగాక, గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలోకి దిగిన అభ్యర్థి కంటే ప్రస్తుత అభ్యర్థికి తిరుపతిపై మంచి పట్టుందన్న వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో, పార్టీ అభ్యర్థి విజయం కోసం ప్రచారం నిర్వహించాలని లోకేశ్ నిర్ణయం తీసుకున్నారు.

  • Loading...

More Telugu News