: కేంద్ర హోంశాఖ నూతన కార్యదర్శిగా ఎల్.సి.గోయల్
కేంద్ర హోంశాఖ నూతన కార్యదర్శిగా ఎల్.సి.గోయల్ నియమితులయ్యారు. ఈ మేరకు ఢిల్లీలోని హోంశాఖ కార్యాలయంలో ఆయన ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. 1979 కేరళ ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన గోయల్ నిన్నటివరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యాలయంలో అంతర్గత భద్రత విభాగం సంయుక్త కార్యదర్శిగా విధులు నిర్వహించారు. శారదా స్కాం నేపథ్యంలో, కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా ఉన్న అనిల్ గోస్వామిని కేంద్ర ప్రభుత్వం తొలగించింది. ఈ క్రమంలో గోయల్ ను కేంద్రం బుధవారం రాత్రి నియమించింది.