: కోడలికి అదిరిపోయే బహుమతి ఇచ్చింది!


సన్ ఫార్మా వ్యవస్థాపకుడు దిలీప్ సంఘ్వి తల్లి కుముద్ తన కోడలికి అదిరిపోయే బహుమతి ఇచ్చింది. రూ.280 కోట్ల విలువ చేసే 30.80 లక్షల షేర్లను తన కోడలు విభా పేరిట బదలాయించింది. ఈ షేర్ల బదిలీ జనవరి 30న జరిగినట్టు తెలుస్తోంది. సన్ ఫార్మాలో కుముద్ షేర్ల సంఖ్య 32.80 లక్షలు కాగా, బదిలీ అనంతరం ఆమె వాటా 0.01 శాతానికి పడిపోయింది. అదే సమయంలో కోడలు విభా వాటా 0.28 నుంచి 0.43కి పెరిగింది. సన్ ఫార్మాను 1983లో స్థాపించారు. ప్రస్తుతం భారత్ లో అతిపెద్ద ఔషధ తయారీదారు ఈ సంస్థే.

  • Loading...

More Telugu News