: 28 ఏళ్ల యువకుడితో 'షకీలా' పెళ్లి?


శృంగార తార షకీలా చిత్రాలు ఒకప్పుడు మలయాళ చిత్ర పరిశ్రమను ఊపేసిన సంగతి తెలిసిందే. షకీలా సినిమా రిలీజ్ అవుతోందంటే మలయాళ అగ్ర హీరోల సినిమాల రిలీజ్ లు సైతం వాయిదా పడేవి. అప్పట్లో అంత క్రేజ్ కలిగిన షకీలా... ఇప్పుడు మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. ఈ శృంగార తార పెళ్లి చేసుకుందన్న వార్త ప్రస్తుతం సోషల్ నెట్ వర్క్ లో హల్ చల్ చేస్తోంది. 28 ఏళ్ల యువకుడిని ఆమె పెళ్లి చేసుకున్నట్టు ఫొటోలు సహా ప్రచారం జరుగుతోంది. అయితే, ఆ వార్తల్లో నిజం లేదని షకీలా కొట్టి పారేసింది. తాను దర్శకత్వం వహిస్తోన్న సినిమాలో ఆ కుర్రాడు నటిస్తున్నాడని, అంతకు మించి తమ మధ్య మరెలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. అతని వయసు 28 ఏళ్లు కాగా, తన వయసు 38 ఏళ్లని... అతను తనకు తమ్ముడి లాంటి వాడని అంది. అయినా తనకిప్పుడు పెళ్లి అవసరం ఏమాత్రం లేదని... పిల్లల్ని కని భూమికి భారం కలిగించాలా? అని ప్రశ్నించింది. పెళ్లి, పిల్లలు లాంటి ఆశలు తనకు లేవని స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News