: తెలంగాణను గవర్నర్ నిలువరించలేకపోతున్నారు: ఏపీ డిప్యూటీ సీఎం కేఈ
ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి నిన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ గా వ్యవహరిస్తున్న ఈఎస్ఎల్ నరసింహన్, తెలంగాణ సర్కారును నిలువరించలేకపోతున్నారని ఆయన ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం తమను ఇబ్బందులు పెడుతున్నా ఓపికతో సర్దుకుపోతున్నామని ఆయన అన్నారు. ఏపీకి తెలంగాణ చేస్తున్న అన్యాయాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. తాము చేస్తున్న ఫిర్యాదులను గవర్నర్ పట్టించుకోవడం లేదని కేఈ ఆరోపించారు. ఇంకొన్నాళ్లు వేచిచూస్తామని, అప్పటికీ గవర్నర్ విఫలమైతే, కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని ఆయన వెల్లడించారు.