: ఇక ఆన్ లైన్ లోనూ తెలంగాణ హస్తకళా రూపాలు... అమెజాన్ సంసిద్ధత!


తెలంగాణ హస్తకళలు ఇకపై ఆన్ లైన్ షాపింగులోనూ లభించనున్నాయి. తెలంగాణ హస్తకళలను ఆన్ లైన్ లో అందుబాటులోకి తెచ్చేందుకు అమెజాన్.కామ్ సంసిద్ధత వ్యక్తం చేసింది. తద్వారా తెలంగాణ పారిశ్రామికాభివృద్ధికి తమవంతు సహకారాన్ని అందించనున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. తెలంగాణలో వ్యాపార విస్తరణకు సంబంధించి తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ను నిన్న ఆ సంస్థ ప్రతినిధులు సచివాలయంలో కలిశారు. మంత్రితో భేటీ అనంతరం అమెజాన్ రియల్ ఎస్టేట్స్ అధిపతి జాన్ షాట్లెర్ మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే తెలంగాణలో భారీ గిడ్డంగిని ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల మహిళలు తయారుచేసే ఉత్పత్తులు, నిర్మల్ బొమ్మలు, పోచంపల్లి చీరలు, బిద్రీ ఉత్పత్తులు తదితరాలను ఆన్ లైన్ ద్వారా విక్రయించనున్నామని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News