: అవసరమైనంత విద్యుత్తును బహిరంగ మార్కెట్లో కొంటాం: కేసీఆర్
రబీకి విద్యుత్ కొరత తప్పదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాదులో విద్యుత్ శాఖ సమీక్ష నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అవసరం మేరకు బహిరంగ మార్కెట్లో విద్యుత్తును కొనుగోలు చేస్తామని అన్నారు. వచ్చే ఏడాది మధ్యంతరానికి ఛత్తీస్ గఢ్ నుంచి విద్యుత్ అందుబాటులోకి వస్తుందని ఆయన వెల్లడించారు. మూడేళ్లలో 21,350 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. 2018 నాటికి తెలంగాణ రాష్ట్రం మిగులు విద్యుత్ ఉత్పత్తి సాధించిన రాష్ట్రంగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. రానున్న బడ్జెట్ లో 1000 కోట్ల రూపాయలను జెన్ కో కు కేటాయిస్తామని కేసీఆర్ తెలిపారు. మణుగూరు విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి భద్రాద్రి ధర్మల్ పవర్ స్టేషన్ పేరును కేసీఆర్ ఖరారు చేశారు.