: గాంధీ ఆసుపత్రిలో స్వైన్ ఫ్లూతో విదేశీ మహిళ మృతి
స్వైన్ ఫ్లూ తీవ్రతను తెలియజేసే సంఘటన గాంధీ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. స్వైన్ ఫ్లూ బారినపడిన ఓ విదేశీయురాలు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. జింబాబ్వేకు చెందిన ఓ మహిళ ఈ నెల 2వ తేదీన స్వైన్ ఫ్లూ లక్షణాలతో గాంధీ ఆసుపత్రిలో చేరింది. చికిత్స అందిస్తుండగా, పరిస్థితి విషమించడంతో ఆమె మృతి చెందింది. మెరుగైన వైద్యసేవలు అందించినప్పటికీ బాధితురాలు మృతి చెందిందని వైద్యులు చెబుతున్నారు.