: కృష్ణా జిల్లాలో ఘోర ప్రమాదం...పెళ్లి కుమార్తె సహా నలుగురి మృతి


కృష్ణాజిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. తోట్లవల్లూరు మండలం రొయ్యూరు వద్ద కాల్వలోకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు గల్లంతయ్యారు. దీనిని గమనించిన ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. మృతుల్లో బాలుడు ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, ఈ కారులో పెళ్లి బృందం చల్లపల్లి నుంచి గుంటూరు వెళ్తొంది. ఇంతలోనే దారుణం సంభవించింది. మరణించిన వారిలో పెళ్లి కుమార్తె ఉండడంతో పెళ్లి వారింట విషాదం నెలకొంది.

  • Loading...

More Telugu News