: ప్రేమికుల రోజున స్పైస్ జెట్ ప్రత్యేక ఆఫర్
ప్రేమికుల రోజున మరింతమంది ప్రయాణికులను ఆకర్షించేందుకు స్పైస్ జెట్ ప్రత్యేక ఆఫర్ ను ప్రకటించింది. రూ.1599కే దేశంలో ఎక్కడికైనా ప్రయాణించవచ్చని తెలిపింది. ఈ ప్రత్యేక టికెట్ల బుకింగ్ ఈ నెల 4 నుంచి 6 వరకు మూడు రోజుల మాత్రమే అందుబాటులో ఉంటుందని చెప్పింది. ఈ నెల 14 నుంచి ఏప్రిల్ 15 వరకు ఎప్పుడైనా ప్రయాణించేందుకు ఈ ఆఫర్ ద్వారా టికెట్లను ముందుగా బుక్ చేసుకోవచ్చు. దేశంలో స్పైస్ జెట్ విమానాలు నడిచే ఏ ప్రాంతానికైనా ఈ టిక్కెట్ ద్వారా ప్రయాణించవచ్చని వెల్లడించింది.