: ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు తథ్యం: మోదీ


ఢిల్లీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు తథ్యమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఢిల్లీ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, రాజధాని అభివృద్ధిని ఉన్నత శిఖరాలకు తీసుకువెళతామని చెప్పారు. ఢిల్లీలోని అంబేద్కర్ నగర్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని పాల్గొన్నారు. ఈ మేరకు ఆయన ప్రసంగిస్తూ, కిరణ్ బేడీ ముఖ్యమంత్రిగా ఢిల్లీ అభివృద్ధి ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. గత పాలకులు 16 ఏళ్లుగా ఢిల్లీని భ్రష్టుపట్టించారని, ఆ పదహారేళ్ల మకిలిని తాము తుడిచి వేస్తామని మోదీ చెప్పారు. అభివృద్ధి మంత్రమే తమ రాజకీయమని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఢిల్లీ అస్థిరతతో సతమతమవుతోందన్నారు.

  • Loading...

More Telugu News