: ఢిల్లీలో గుజరాత్ సీఎం ఎన్నికల ప్రచారం
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో బీజేపీ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేసింది. మరికొన్ని రోజుల్లో పోలింగ్ జరగనుండటంతో పక్క రాష్ట్రాల పార్టీ నేతలతో ప్రచారం చేయించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో, గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందిబెన్ పటేల్ ఢిల్లీలో పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేయబోతున్నారు. రేపు రెండు ఎన్నికల ప్రచార ర్యాలీల్లో ఆమె పాల్గొంటున్నారని బీజేపీ రాష్ట్ర మీడియా కన్వీనర్ హర్షవర్థన్ పటేల్ తెలిపారు. ఆమెతో పాటు గుజరాత్ కు చెందిన మరికొందరు బీజేపీ నేతలు, మంత్రులు సైతం ప్రచారంలో పాల్గొంటారని చెప్పారు.