: కేసీఆర్ భాషనే జగన్ కూడా వాడుతున్నారు: కేఈ
వైకాపా అధినేత జగన్ తన పద్ధతి మార్చుకోవాలని ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సూచించారు. రాష్ట్ర ఉన్నతి కోసం పరితపిస్తున్న తమపై రాళ్లు విసరడం మాని, రాజధాని నిర్మాణానికి రాళ్లు అందించాలని సలహా ఇచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలాంటి భాష వాడుతున్నారో... జగన్ కూడా అలాంటి భాషే వాడుతున్నారని ఆరోపించారు. అసైన్డ్ భూముల వ్యవహారంలో సర్వే చేయిస్తామని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో కేంద్ర ప్రభుత్వం న్యాయం చేస్తుందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వ వ్యవహార శైలిపై గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరారు.