: ఓటమిని జీర్ణించుకోలేని పయ్యావుల కేశవ్ రాజ్యాంగేతర శక్తిగా మారారు: వైకాపా


టీడీపీ మాజీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పై అనంతపురం జిల్లా ఉరవకొండ వైకాపా ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో ఓడిపోయిన కేశవ్, ఇప్పటికీ తన ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారని... ఈ క్రమంలో, ఆయన ఓ రాజ్యాంగేతర శక్తిగా అవతరించారని ఆరోపించారు. ఉరవకొండ నియోజకవర్గంలోని వైకాపా నేతలపై తప్పుడు కేసులను బనాయిస్తూ, ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. పయ్యావుల కేశవ్ తో పాటు ఆయన సోదరుడు కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

  • Loading...

More Telugu News