: తెలంగాణ ప్రజలను చంద్రబాబు అవమానించారు: కేసీఆర్ తనయ కవిత
తెలంగాణ ప్రజలను ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అవమానించారని తెలంగాణ సీఎం తనయ, నిజామాబాదు ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. టీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో భాగంగా తొలి సభ్యత్వం తీసుకున్న సందర్భంగా కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన కవిత, చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించారు. హైదరాబాదును విదేశాలతో పోలుస్తూ చంద్రబాబు తెలంగాణ ప్రజలను అవమానపరచారని ఆమె వ్యాఖ్యానించారు. 2019 ఎన్నికల్లో ఏపీతో పాటు తెలంగాణలోనూ టీడీపీ అధికారంలో వస్తుందని ఎలా చెబుతారని ఆమె ప్రశ్నించారు.