: లంకేయులకు మోదీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
శ్రీలంక స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. దీనిపై ట్విట్టర్లో స్పందించారు. "స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శ్రీలంక ప్రజలకు శుభాకాంక్షలు. మన చారిత్రక బంధాలు, సంస్కృతి, ఉమ్మడి విలువలు ఎప్పటికీ చెరిగిపోనివి" అని ట్వీట్ చేశారు. రానున్న ఏళ్లలో శ్రీలంక పురోగామి పథంలో పయనించాలని ఆకాంక్షిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ నెలలో శ్రీలంక అధ్యక్షుడు సిరిసేన రాక కోసం ఎదురుచూస్తున్నట్టు తెలిపారు. సిరిసేన రెండ్రోజుల పర్యటన కోసం ఈ నెల 16న భారత్ వస్తారు. జనవరి 9న జరిగిన ఎన్నికల్లో సిరిసేన... మహింద రాజపక్సను ఓడించి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడం తెలిసిందే.