: నేను, పవన్ కల్యాణ్ రోజూ మాట్లాడుకుంటాం: రేణు దేశాయ్
తాను, పవన్ కల్యాణ్ విడాకులు తీసుకుని విడిపోయినా, స్నేహితుల మాదిరి కలిసే ఉన్నామని రేణు దేశాయ్ తెలిపారు. ప్రతి రోజు ఇద్దరం ఫోన్ లో మాట్లాడుకుంటామని స్పష్టం చేశారు. తమ పిల్లల పట్ల ఇద్దరం ప్రేమతో ఉంటామని చెప్పారు. మా వివాహం సఫలం కాకపోయినప్పటకీ, ఇప్పటికీ పరస్పరం గౌరవించుకుంటామని రేణు తెలిపారు. పవన్ అంటే తనకు ఇప్పటికీ చాలా అభిమానమని చెప్పారు. ఎక్కడైనా, ఎవరైనా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినా పట్టించుకోవద్దని తనకు పవన్ సూచించారని తెలిపారు.