: దేశంలో తొలి స్మార్ట్ సిటీగా విశాఖపట్టణం... 'సిస్కో' సంస్థ కసరత్తు


భారతదేశంలోనే మొదటి ఆకర్షణీయ నగరంగా (స్మార్ట్ సిటీ) రూపుదిద్దుకునేందుకు విశాఖపట్టణం సిద్ధమవుతోంది. నగరాన్ని తీర్చిదిద్దేందుకు 'సిస్కో' సంస్థ కసరత్తులు ప్రారంభించింది. విశాఖను ఆకర్షణీయంగా తీర్చిదిద్ది ఆ నమూనాను మిగతా రాష్ట్రాల్లో అమలు చేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆ సంస్థ ముఖ్య సాంకేతిక అధికారి పద్మశ్రీ వారియర్, సిస్కో సిస్టమ్స్ ప్రెసిడెంట్ అనిల్ మీనన్ లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ అభివృద్ధి నమూనాను గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్రల్లో అమలు చేస్తామని మీనన్ తెలిపారు. గ్లోబల్ టాలెంట్ ట్రాకర్ అనే కంపెనీ ద్వారా ఏపీలో నైపుణ్యాభివృద్ధికి సహకరిస్తామని చెప్పారు. ఈ సంస్థ కార్యాలయాన్ని త్వరలోనే విశాఖలో ప్రారంభిస్తామన్నారు. కాగా, తిరుపతి లేదా విశాఖలో ఇంక్యుబేషన్ కేంద్రాన్ని, బార్సిలోనా తరహాలో లివింగ్ ల్యాబ్స్ కూడా ఏర్పాటు చేయాలని సిస్కో ఆలోచన చేస్తోంది. ఈ క్రమంలో ఓ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని చంద్రబాబు చెప్పారు.

  • Loading...

More Telugu News