: బెజవాడలో దారిదోపిడీ ముఠా అరెస్ట్... రూ.1.10 లక్షల నగదు, వాహనాలు స్వాధీనం


రాత్రివేళల్లో జాతీయ రహదారులపై దారి కాచి దోపిడీలకు పాల్పడుతున్న ఓ ముఠాకు బెజవాడ పోలీసులు బేడీలు వేశారు. ముఠాలోని 14 మంది సభ్యులను అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి రూ.1.10 లక్షల నగదుతో పాటు రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ నుంచి హైదరాబాదు, చెన్నై మార్గాల్లో సదరు ముఠా, పలు వాహనాలపై దాడులు చేసి పెద్ద ఎత్తున సొత్తును దోచుకుందని విజయవాడ పోలీస్ కమిషనర్ ఏబీ వెంకటేశ్వరరావు కొద్దిసేపటి క్రితం నిర్వహించిన మీడియా సమావేశంలో చెప్పారు. నిందితులను నేడు కోర్టులో హాజరుపరచనున్నామని ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News