: వరల్డ్ కప్ బెర్తు దక్కని ఆటగాడు 15 సిక్సర్లతో సెలక్టర్లను అపహాస్యం చేశాడు!


ఇంగ్లాండ్ జట్టులో నిన్నమొన్నటివరకు బెన్ స్టోక్స్ ను ఆశాకిరణంగా భావించారు. కానీ, అనూహ్యంగా అతడికి వరల్డ్ కప్ బెర్తు నిరాకరించి వివాదానికి తెరలేపారు అక్కడి సెలక్టర్లు. అయితే, సెలక్టర్ల నిర్ణయాన్ని అపహాస్యం చేస్తూ, దక్షిణాఫ్రికా-ఎ జట్టుతో జరిగిన వన్డే మ్యాచ్ లో చెలరేగిపోయాడు స్టోక్స్. కేవలం 86 బంతుల్లో 151 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. స్టోక్స్ స్కోరులో 15 సిక్సులు, 7 ఫోర్లున్నాయి. దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియా టౌన్ షిప్ లో జరిగిన ఈ మ్యాచ్ లో తొలుత ఇంగ్లాండ్ లయన్స్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 378 పరుగులు చేయగా, దక్షిణాఫ్రికా-ఎ 42.5 ఓవర్లలో 289 పరుగులకు ఆలౌటైంది. కాగా, వరల్డ్ కప్ కు ఇంగ్లాండ్ జట్టులో స్టోక్స్ ను ఎంపిక చేయకపోవడంపై కెవిన్ పీటర్సన్, పాల్ కాలింగ్ వుడ్, ఇయాన్ బోథమ్ వంటి దిగ్గజాలు ఈసీబీని తప్పుబట్టారు. మంచి ఫామ్ లో ఉన్నా స్టోక్స్ ను ఎందుకు తీసుకోలేదంటూ ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News