: ఊగిపోయిన కేజ్రీవాల్... ప్రజలను చూసి కంటతడిపెట్టిన కిరణ్ బేడీ
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తుది అంకానికి చేరుకుంది. దీంతో ప్రధాన రాజకీయ ప్రత్యర్ధులుగా బరిలోకి దిగిన బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. విరాళాల సేకరణపై ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పై బీజేపీ నిన్న విరుచుకుపడిన సంగతి తెలిసిందే. బీజేపీ ఆరోపణలపై కేజ్రీవాల్ కూడా అంతే ఘాటుగా స్పందించారు. నేటి ఉదయం మొదలైన ప్రచారంలో భాగంగా కేజ్రీవాల్, బీజేపీ అసత్య ఆరోపణలపై ఊగిపోయారు. విచారణ చేపట్టి దోషిగా తేలితే, అరెస్ట్ చేయండని ఆయన బీజేపీకి సవాల్ విసిరారు. కేజ్రీవాల్ సవాల్ ను బీజేపీ సీఎం అభ్యర్థి కిరణ్ బేడీ తిప్పికొట్టారు. అరెస్ట్ పేరిట ప్రజల సానుభూతిని సంపాదించుకునేందుకు కేజ్రీవాల్ యత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. నేటి ఆమె ప్రచారానికి ఢిల్లీ ప్రజలు పోటెత్తారు. ప్రజాభిమానాన్ని చూసిన కిరణ్ బేడీ కంటతడిపెట్టారు.