: మేము తెలంగాణ కమ్మవాళ్లం... ఆంధ్రోళ్లు అంటూ దూరం పెట్టకండి


ఇప్పటిదాకా ఉమ్మడిగా ఉన్న కుల సంఘాలు, ఇకపై ప్రాంతాల వారీగా చీలిపోయే అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పటికే, తెలంగాణలో ప్రత్యేకంగా కమ్మ సంఘం ఏర్పాటు దిశగా ప్రయత్నాలు మొదలైనట్టు సమాచారం. తెలంగాణ ప్రాంతానికి చెందిన కొంత మంది కమ్మ నాయకులు... తమను తెలంగాణ వారిగానే గుర్తించాలని, ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారిగా పరిగణించరాదని చెబుతున్నారు. ఆంధ్రోళ్లు అనే ముద్రవేసి తమను దూరంగా ఉంచరాదని కోరుతున్నారు. ఈ క్రమంలో, కొల్లూరి విశ్వనాథంలాంటి కొంత మంది ప్రముఖులు... టీఎస్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలసి దీనిపై లోతుగా చర్చ జరిపినట్టు తెలుస్తోంది. మరోవైపు, కమ్మ సామాజికవర్గాన్ని ఆకట్టుకునే ప్రయత్నంలో ఉన్న టీఆర్ఎస్ కు ఈ పరిణామం కలసివచ్చేలా కనిపిస్తోందని కొందరు అంటున్నారు.

  • Loading...

More Telugu News