: ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల పైశాచికం... జోర్డాన్ పైలట్ సజీవదహనం
తమ వద్ద బందీగా ఉన్న జోర్డాన్ పైలట్ మోజ్ అల్- కసస్ బెహ్ ను ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు అత్యంత దారుణంగా హతమార్చారు. ఆయనను ఒక బోనులో నిలబెట్టి మంటలు అంటించి సజీవదహనం చేసి ఆ వీడియోను విడుదల చేశారు. గత సంవత్సరం డిసెంబర్లో సిరియాలోని రక్కా సమీపంలో పైలట్ ను ఐసిస్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. అల్- కసస్ బెహ్ ను విడిపించేందుకు తమ వద్ద బందీగా ఉన్న ఐసిస్ మహిళా నేతను విడుదల చేస్తామని జోర్డాన్ ప్రకటించినా ఉగ్రవాదులు తగ్గలేదు. కాగా, కసస్ బెహ్ సజీవ దహనం విషయం తెలియగానే, జోర్డాన్ ప్రభుత్వం ఇద్దరు ఉగ్రవాదులను ఉరితీసింది. కసస్ బెహ్ నిజమైన హీరో అని జోర్డాన్ రాజు అబ్దుల్లా కొనియాడారు.