: పద్మావతి అమ్మవారి ఆలయంలో నెయ్యి కుంభకోణం... విచారణకు ఆదేశం


పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిలోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నెయ్యి కుంభకోణం వెలుగు చూసింది. అమ్మవారి ఆలయానికి సరఫరా అవుతున్న నెయ్యి మాయమవుతోంది. కొంతకాలంగా జరుగుతున్న ఈ తంతు నేటి ఉదయం వెలుగు చూసింది. సరఫరాదారులు ఆలయానికి నెయ్యి సరఫరా చేయగానే, దానిని అక్కడి సిబ్బంది గుట్టుచప్పుడు కాకుండా మార్కెట్ కు తరలిస్తున్నారు. మూడు నెలల కాలంలోనే రూ.10 లక్షల విలువ చేసే నెయ్యి మాయమైనట్లు తెలుసుకుని ఆలయ అధికారులు తెల్లబోయారు. నెయ్యి మాయంపై సమగ్ర విచారణకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

  • Loading...

More Telugu News