: బాసర ట్రిపుల్ ఐటీలో లెక్చరర్ వేధింపులు... మెదక్ జిల్లా విద్యార్థిని సూసైడ్


బాసర ట్రిపుల్ ఐటీలో పనిచేస్తున్న అధ్యాపకుడి వేధింపుల కారణంగా ఓ చదువుల తల్లి తనువు చాలించింది. పాఠాలు చెప్పాల్సిన అధ్యాపకుడు వేధింపులకు దిగడంతో మనస్తాపానికి గురైన థర్డ్ ఇయర్ విద్యార్థిని స్వప్న ఆత్మహత్య చేసుకుంది. తన సొంతూరు మెదక్ జిల్లా మనూరు మండలం ఉసిరికపల్లికి వచ్చిన విద్యార్థిని రాత్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చేసుకునే ముందు విద్యార్థిని రాసిన సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాసర ట్రిపుల్ ఐటీలో పనిచేస్తున్న ఓ అధ్యాపకుడితో పాటు మరో విద్యార్థిని తన ఆత్మహత్యకు కారణమని స్వప్న తన సూసైడ్ నోట్ లో ఆరోపించింది.

  • Loading...

More Telugu News