: ఇక ఏపీలోనూ చెరువుల పూడికతీత... పనుల్లో స్వయంగా పాల్గొంటానన్న చంద్రబాబు!


నానాటికీ కుచించుకుపోతున్న చెరువులను పునరుద్ధరించుకునేందుకు తెలంగాణ సర్కారు ‘కాకతీయ మిషన్’ పేరిట రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. తాజాగా ఇదే బాటలో ఏపీ సర్కారు కూడా పయనిస్తోంది. రాష్ట్రంలోని చెరువుల్లో పూడికతీతతో పాటు చెక్ డ్యాం నిర్మాణ పనులను కూడా చేపట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ప్రతి జిల్లాకూ రూ.5 కోట్లు కేటాయించింది. చెరువుల పూడికతీత పనుల్లో స్వయంగా పాలుపంచుకుంటానని సీఎం నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు. జన్మభూమి, మా ఊరు కమిటీ ఆధ్వర్యంలో మార్చి నుంచి జూన్ దాకా ఈ పనులను చేపట్టనున్నట్టు ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News