: అవును, సచివాలయం కూల్చేస్తున్నాం: కేసీఆర్
అవును, సచివాలయం కూల్చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పునరుద్ఘాటించారు. హైదరాబాదులోని కొంపల్లిలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ సచివాలయాన్ని అమ్మేస్తామని అన్నారు. తరువాత దొర్లిన పొరపాటును సరి చేసుకుని, సచివాలయాన్ని కూల్చేస్తే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. మార్కెట్లు టీడీపీ, కాంగ్రెస్ నేతల తలలపై ఏర్పాటు చేయాలా? అని ఆయన అడిగారు. ఏం చేయాలో తమకు తెలుసని చెప్పిన ఆయన, భవిష్యత్ ప్రణాళికల కోసం సచివాలయం మారుస్తామని ఆయన తెలిపారు. కాగా, సచివాలయ మార్పుపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.