: స్వైన్ ఫ్లూ పట్ల అప్రమత్తంగా ఉండండి: బాబు హెచ్చరిక
స్వైన్ ఫ్లూ ప్రమాదకరమైన వ్యాధికాదు, దాని ప్రభావం ఏమీ లేదని తెలంగాణ రాష్ట్రంలో వైద్యులే తేల్చేసిన తరుణంలో, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రజలను హెచ్చరించారు. స్వైన్ ఫ్లూపై సమీక్ష జరిపిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలంతా స్వైన్ ఫ్లూ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వ్యాధి నివారణకు చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. వ్యాధినివారణకు కట్టుబడి ఉన్నామని తెలిపిన ఆయన, సమస్య ఉందని అనుమానం వస్తే ఆసుపత్రికి వెళ్లి నిర్థారణ చేసుకోవాలని సూచించారు.