: ప్రధాని నివాసం, పార్లమెంటుపై దాడులు జరగొచ్చు... ఐబీ హెచ్చరిక
ఇంటలిజెన్స్ బ్యూరో కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసింది. ఢిల్లీలోని ప్రధానమంత్రి అధికారిక నివాసం, పార్లమెంటు భవనంపై ఉగ్రవాద ఆత్మాహుతి దాడులు జరగవచ్చని, అప్రమత్తంగా ఉండాలంటూ తాజాగా హెచ్చరించింది. దాంతో, ఢిల్లీ పోలీసు బలగాలు, కేంద్ర పారామిలిటరీ దళాలు ఈ రెండు చోట్ల భారీ భద్రత చేపట్టాయి. అంతేగాక, రాజధానిలోని పలు సున్నిత ప్రాంతాల్లోనూ భద్రత కట్టుదిట్టం చేస్తున్నారు. తమకున్న సమాచారం ప్రకారం ఇప్పటికే ఢిల్లీలోకి ఫిదాయీలు (ఆత్మాహుతి దళ సభ్యులు) ప్రవేశించారని ఐబీ స్పష్టమైన హెచ్చరికలు చేసింది.