: అమెరికాలోని డల్లాస్ సిటీలా హైదరాబాద్ ను తయారుచేస్తాం: కేసీఆర్


హైదరాబాదును విశ్వనగరంగా తీర్చి దిద్దుతామని టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అమెరికాలోని డల్లాస్ సిటీలా నగరాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. నగర జనాభా కోటికి చేరినప్పటికీ, సదుపాయాలు మాత్రం బాగాలేవని అన్నారు. వర్షం వస్తే రోడ్లన్నీ నీటితో నిండిపోతాయని... బస్తీల్లో బకెట్లతో నీటిని తోడుకునే పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. హైటెక్ నగరాన్ని తయారు చేశామని చెప్పుకుంటే సరిపోదని చంద్రబాబుపై సెటైర్ విసిరారు. సిటీలో పార్కులు, శ్మశానాలు, దోభీఘాట్ లు, పార్కింగ్ సదుపాయాలు ఏవీ లేవని అన్నారు. అత్యంత సుందర నగరంగా హైదరాబాదును తయారు చేస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News