: ఇక్కడ ప్రతి రూపాయికి లెక్క ఉంటుంది!: ఆప్


ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ నిధుల సమీకరణపై బీజేపీ చేస్తున్న ఆరోపణలకు ఆమ్ ఆద్మీ పార్టీ దీటుగా సమాధానమిచ్చింది. ఈ మేరకు ఆప్ ప్రతినిధులు మాట్లాడుతూ, కుట్రలో భాగంగా బీజేపీ నేతలు అవాకులు చవాకులు ప్రచారం చేస్తున్నారని అన్నారు. అన్ని పార్టీల నిధుల సమీకరణపై సీబీఐ దర్యాప్తు చేయాలని సూచించారు, కేంద్రంలో ఉన్నది బీజేపీయే కనుక విచారణ చేసుకోవాలని సవాలు విసిరారు. తమ పార్టీ తీసుకున్న ప్రతి రూపాయికీ లెక్కుందని వారు స్పష్టం చేశారు. విమర్శించే క్రమంలో పార్టీలు దిగజారకూడదని హితవు పలికిన ఆప్ ప్రతినిధులు, బీజేపీ కుయుక్తులు పన్నుతోందని ఆరోపించారు.

  • Loading...

More Telugu News