: ఓ కుమార్తెను చంపి జైలుకెళ్లింది... జైల్లో మరో కుమార్తెను చంపేసింది!
హర్యానాలో దారుణం చోటుచేసుకుంది. ఓ కుమార్తెను చంపి జైలుకెళ్లిన ఓ మహిళ... జైల్లో మరో కుమార్తెను బలిదీసుకుంది. వివరాల్లోకెళితే... రోహ్ తక్ జిల్లాకు చెందిన ఓ మహిళ తన ఏడాది కుమార్తెను చంపిన నేరంపై జైల్లో ఉంది. ఆ నేరానికి పాల్పడే సమయానికి ఆమె గర్భవతి. ఆ మహిళ అత్త చేసిన ఫిర్యాదు మేరకు ఆమెను జనవరి 9న అరెస్టు చేశారు. అయితే, ఇటీవలే ఆమె ఓ ఆడ శిశువుకు జన్మనిచ్చింది. కానీ, ఆ పసికందును కూడా మూడ్రోజుల క్రితం చంపేసింది. ఈ వ్యవహారంలో ఆమెను నేడు కోర్టు ఎదుట హాజరుపరచనున్నారు. ఈ హత్యలు ఎందుకు చేసిందన్న విషయం తెలియాల్సి ఉంది.