: ఫేస్ బుక్, ట్విట్టర్ వ్యాఖ్యలను నేరంగా చూడలేము: సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం
సామజిక మాధ్యమ సేవలందిస్తున్న ఫేస్ బుక్, ట్విట్టర్ తదితర వెబ్ సైట్లలో చేసే వ్యాఖ్యల్లో కొన్ని అభ్యంతరకరంగా ఉన్నప్పటికీ, వాటిని నేరంగా పరిగణించలేమని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్ లను విచారిస్తున్న సందర్భంగా కేంద్రం ఈ వ్యాఖ్యలు చేసింది. సోషల్ మీడియాలో అతిగా స్పందిస్తూ, వ్యక్తులకు బాధను, అసౌకర్యాన్ని కలిగించేలా వ్యాఖ్యానిస్తే పోలీసులు అరెస్ట్ చేసేలా ఐటీ చట్టానికి కొత్త మార్పులను సంబంధిత కమిటీ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. "వాక్ స్వాతంత్రపు హక్కును కత్తిరించాలని కేంద్రం భావించడంలేదు. తన భావాన్ని వెలిబుచ్చడం నేరం కాదు. అయితే సైబర్ నేరాలకు మాత్రం కొత్త ఐటీ చట్టం అమలవుతుంది" అని కేంద్రం తెలిపింది.