: చంద్రబాబు ఓ దుబారా బాబు!: వైసీపీ నేత అంబటి
ఏపీ సీఎం చంద్రబాబునాయుడిపై వైసీపీ నేత అంబటి రాంబాబు మరోసారి విరుచుకుపడ్డారు. విదేశీ పర్యటనల పేరిట చంద్రబాబు దుబారా చేస్తున్నారని ఆయన కొద్దిసేపటి క్రితం ఆరోపించారు. ‘‘చంద్రబాబు ఒట్టి దుబారా బాబు. సింగపూర్, జపాన్ పర్యటనల కోసం రూ.2.20 కోట్ల నిధులను విడుదల చేయించుకున్నారు. చంద్రన్న కానుక పేరిట పండుగ పూట ప్రజలకు నాణ్యత లేని సరుకులు పంపిణీ చేశారు. ఎన్నికల్లో చందాలిచ్చిన వారికి మేలు చేసేందుకే పథకాలు ప్రవేశపెడుతున్నారు’’ అని అంబటి రాంబాబు ఆరోపించారు.