: కేజ్రీవాల్ బయటివాడు కాదు... పోటీ చేయవచ్చు: ఈసీ
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు ఎన్నికల సంఘం ఊరటనిచ్చింది. అతను బయటి వ్యక్తి కాదని, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయవచ్చని స్పష్టం చేసింది. కేజ్రీవాల్ ఢిల్లీ ఓటరేనని, తద్వారా అతడు బరిలో దిగేందుకు అర్హుడేనని ఈసీ వివరించింది. కేజ్రీవాల్ ఢిల్లీ వ్యక్తి కాదని, ఆయనకు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అర్హత లేదని కాంగ్రెస్ అభ్యర్థి కిరణ్ వాలియా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేయడం తెలిసిందే. దీంతో, హైకోర్టు కేజ్రీవాల్ కు నోటీసులు పంపడంతో పాటు, ఈసీ స్పందన కూడా కోరింది. ఈ నేపథ్యంలోనే, ఈసీ కేజ్రీవాల్ స్థానికతపై వివరాలు తెలిపింది.