: ఢిల్లీ ఎన్నికలకు బీజేపీ విజన్ డాక్యుమెంట్ విడుదల


ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ విజన్ డాక్యుమెంట్ (దార్శనిక పత్రం) ను విడుదల చేసింది. ఎన్నికల ప్రణాళిక (మేనిఫెస్టో) బదులుగా ఈ పత్రాన్ని బీజేపీ సీఎం అభ్యర్థి కిరణ్ బేడీ ఈరోజు ఢిల్లీలో విడుదల చేశారు. మొత్తం 270 అంశాలను ఈ పత్రంలో పేర్కొన్నారు. ఢిల్లీ ప్రజల కలలను బీజేపీ సాకారం చేస్తుందని, మహిళలకు భద్రత పెంపు, యువతకు ఉపాధి, పర్యావరణం, విద్యుత్-తాగునీరు తదితర సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని డాక్యుమెంటులో స్పష్టం చేసింది. అన్ని ప్రభుత్వ విభాగాల్లోను అవినీతిని పారద్రోలడం, ఢిల్లీని ప్రపంచస్థాయి నగరంగా అభివృద్ధి చేయడం తమ లక్ష్యమని బీజేపీ పేర్కొంది.

  • Loading...

More Telugu News