: మరోసారి తల్లయిన పాప్ సింగర్ షకీరా


కొలంబియన్ పాప్ గాయకురాలు షకీరా రెండవసారి తల్లయింది. ఈసారి కూడా ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలో షకీరా స్వయంగా వెల్లడించింది. "సాషా పిక్ మెబారక్ (కుమారుడి పేరు) పోయిన గురువారం రాత్రి 9.54 నిమిషాలకు బార్సిలోనాలో జన్మించాడు" అని తెలిపింది. వారిద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. స్పానిష్ ఫుట్ బాల్ క్రీడాకారుడు గెరార్డ్ పిక్, షకీరా గత నాలుగేళ్లుగా కలసి జీవిస్తున్న సంగతి తెలిసిందే. 2013లో వారిద్దరికీ తొలిసంతానం కలిగింది.

  • Loading...

More Telugu News