: మోదీ... భార్యను ఇంటికి తెచ్చుకో: సీపీఐ నేత నారాయణ సంచలన వ్యాఖ్య
సంచలనాలకు మారుపేరైన సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ నిన్న మరో సంచలన వ్యాఖ్య చేశారు. బీజేపీ మతోన్మాదంపై విమర్శలు గుప్పిస్తున్న క్రమంలో ఆయన ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్య చేశారు. ‘‘మోదీ... భార్యను ఇంటికి తెచ్చుకో’’ అంటూ నారాయణ చేసిన వ్యాఖ్య బీజేపీ శ్రేణులను ఆగ్రహావేశాలకు గురి చేసింది. నిన్న విజయవాడలో మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఘర్ వాపసీపై అసహనం వ్యక్తం చేసిన నారాయణ ‘‘దేశంలో ఇప్పటి వరకు సాధించిన సెక్యూలరిజానికి, దేశ సమైక్యతకు ప్రమాదం వాటిల్లుతోంది. సంఘ్ పరివార్ శక్తులు హిందూత్వాన్ని రెచ్చగొడుతున్నాయి. ఘర్ వాపసీ కొత్తగా వచ్చినది కాదని బీజేపీ అంటోంది. అలా అయితే, మోదీ... తన భార్యను ఇంటికి తెచ్చుకోవాలి. బయటకు వెళ్లిన వారిని తిరిగి రమ్మంటున్నారు. ఇదెక్కడి ఉల్లిపాయ శాస్త్రం?’’ అని వ్యాఖ్యానించారు.